తెనాలి నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

గుంటూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లా తెనాలి శివారు నుంచి 131వ రోజు పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి కఠెవరం, సోమసుందరపాలెం క్రాస్‌ మీదుగా పాదయాత్ర కంచర్లపాలెంకు చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.30కు ప్రారంభమౌతుంది. జాషువా నగర్, నందివెలుగు, కొలకలూరు క్రాస్‌, చింతలపూడి, దుగ్గిరాల మీదుగా మంచికలపూడి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.  


Back to Top