196వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ ప్రారంభం

తూర్పు గోదావ‌రి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభ‌మైంది. ఉద‌యం నుంచి వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు కాస్త విరామం ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు వ‌ర్షం ఆగిపోవ‌డంతో భోజ‌న విరామం అనంత‌రం  చింతలపల్లి నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.  తనను కలిసేందుకు వచ్చే వారితో మమేకమై, వారి వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top