భైరవపట్నంలో జననేతకు ఘనస్వాగతం

కృష్ణ

: కైకలూరు నియోజకవర్గంలో జననేత ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గన్నవరం శివారు నుంచి 159వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండపల్లి, బీగురుకోట క్రాస్‌ మీదుగా భైరవపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డకు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ మేరకు గ్రామస్తులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. 

Back to Top