ప్రజా సంకల్పయాత్ర 33 వ రోజు షెడ్యూల్

అనంతపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత  వైయస్  జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం నాడు కూడా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు.  ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం చిన్నంపల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్‌ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం వైఎస్సార్‌ కాలనీ, అక్కంపల్లి క్రాస్‌ రోడ్డు , నందమూరి నగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటల సమయంలో పాపంపేట వద్ద బహిరంగ  సభ ఉంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.


Back to Top