ప్రజాసంకల్పయాత్ర 40వ రోజు షెడ్యూల్

పుట్టపర్తి: ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  40వ రోజున బుధవారం నాడు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం, వెంకటాపురం క్రాస్‌రోడ్డు నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. అక్కడి నుంచి చిలకలగడ్డపల్లి కొట్టాలుకు, అటు నుంచి  నాయనవారిపల్లి క్రాస్‌,  నల్లమాడ మండలం బాపనకుంట,  నీరాలవంక తండా క్రాస్‌,  రెడ్డిపల్లికి పాదయాత్ర చేరుకుంటుంది.అక్కడ పార్టీ జెండాను జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు.  

అటు రువాత ఆర్‌.రామాపురం, నల్లసింగయ్యగారిపల్లికి,  నల్లమాడ క్రాస్‌కు జగన్‌ పాదయాత్ర చేరుకుంటుందని ఆయన తెలిపారు.

Back to Top