ప్రారంభమైన 161 రోజు నాటి పాదయాత్ర

ఏలూరు: అశేష అభిమాన ప్రజలు వెంటరాగా ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి తన 161 రోజు నాటి ప్రజా సంకల్పయాత్రను మహేశ్వరపురం శివారం నుంచి
కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. అంతకు
ముందు వేద పండితులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. ఈ పాదయాత్రలో మరో కీలక ఘట్టనానికి వేదిక
కానున్న నేటి పాదయాత్రలో స్థానిక నాయకులు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
నేటి మధ్యాహ్నం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటనున్నది. ఈసందర్భంగా 40
అడుగుల పైలాన్ ను నిర్మించగా, దానిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆవిష్కరించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు
పూర్తి చేశారు.

Back to Top