127 వ రోజు ప్రజా సంకల్పయాత్ర

గుంటూరు : ప్రతి పక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 127 వ రోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొనసాగనుంది. మంగళవారం ఉదయం శ్రీరామ్ నగర్ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అటునుంచి చుట్టిగుంట, అంకమ్మనగర్‌, ఎత్తురోడ్‌ సెంటర్‌ మీదుగా నల్లచెరువు చేరుకుంటారు. మూడుబొమ్మల సెంటర్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, జిన్నా టవర్‌ సెంటర్‌ మీదుగా  కింగ్‌ హోటల్‌ సెంటర్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. కింగ్ హోటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Back to Top