ప్రజా సంకల్పయాత్ర


ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైయస్ ఆర్ సీపీ  అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన 'ప్రజాసంకల్ప యాత్ర'కు కాసేపట్లో శ్రీకారం చుడుతున్నారు.  వైయస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర లో వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులు అర్పించిన అనంతరం, బహిరంగ సభతో ఈయాత్ర ఆరంభంకానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.
Back to Top