కొద్ది సేపట్లో నెల్లూరు జిల్లాలోకి వైయస్ జగన్ పాదయాత్ర

చిత్తూరు: వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 69 వ రోజునాటి పాదయాత్ర మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా రెడ్డి గుంట బాడవ శివారు నుంచి ప్రారంభమైంది. అటుపైన సురమాల వద్ద చిత్తూరు జిల్లా పర్యటన ముగిసి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.  సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతుంది. పెనబాక, పీటీ కండ్రిగ, అర్లపాడు క్రాస్‌, చెంబేడు మీదుగా నందిమాల క్రాస్‌, సీఎన్‌పేట, ఉమ్మాలపేట వరకూ పాదయత్ర కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటివరకూ ఆయన 923.1 కిలోమీటర్లు నడిచారు.

Back to Top