రేపటి నుంచి అనంతపురంలో ప్రజా సంకల్ప యాత్ర

కర్నూలు :  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర 26 వ రోజున అనంతపురం జిల్లాకు చేరనుంది. ఇంతవరకు కడప, కర్నూలు జిల్లాల్లో సాగిన ఈ యాత్ర సోమవారం నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి మండలంలోకి ప్రవేశించనుంది. అశేష ప్రజా స్పందన నడుమ కర్నూలు జిల్లాలోనే వంద, రెండువందలు, మూడు వందల కిలోమీటర్ల మైలు రాళ్లను దాటింది. గత నెల 6  వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ పాదయాత్ర తొలి ఏడు రోజుల పాటు (14 వ తేదీ వరకు) కడప జిల్లాలో 93.8 కిలోమీటర్లు జరిగింది. అటు తరువాత 20 వ రోజుల పాటు కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కొనసాగి, ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలోని మదనంతపురం జొన్నగుడి, ఎర్రగుడి గ్రామాల మీదుగా గుంతకల్లు శివారు ప్రాంతాలకు చేరుకుంది.  
సోమవారం నాడు గుత్తి మండలంలోని బసినేపల్లి, గుత్తి ఆర్ఎస్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో వైయస్ జగన్్ మోహన్ రెడ్డి 
పాదయాత్ర కొనసాగుతుందని  పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జిల్లాలో 20 రోజుల పాటు దాదాపు 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.

అనంత సమస్యల చెంతకు జగనన్న 

- నడుస్తున్న చంద్రబాబు పాలనలో జిల్లాలో 326 మంది రైతుల ఆత్మహత్యలు. 
-36 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు, 
-సమస్యల సుడిగుండంలో 2 లక్షల నేతన్నల  కుటుంబాలు
-రుణమాఫీ జరగకపోగా, రుణాలు చెల్లించాలంటూ రైతులపై బ్యాంకర్ల వత్తిడి.
-ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న రైతన్నలు,
- కరువు పరిస్థితుల్లో  దాదాపు 4 లక్షల మంది పైగా జిల్లాను వీడి వలస బాట.
Back to Top