ప్రారంభమైన 162 రోజు పాదయాత్ర

ఏలూరు ప్రతిపక్ష నేత వైయస్
జగన్ మోహన్ రెడ్డి  162 రోజు నాటి పాదయాత్ర
కొద్ది సేపటి క్రితం ఏలూరు తూర్పు లాకుల నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర 2 వేల
కిలోమీటర్లు దాటిన ఉత్సాహంతో మంగళవారం నాడు కూడా స్థానికులు పెద్ద ఎత్తున జననేత
అడుగులో అడుగులు వేస్తున్నారు. పాలగూడెం గ్రామం మార్గంలో  వికలాంగులు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి
వైయస్ జగన్ తో తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. రహదారికి ఇరువైపులా బారులు తీరి
ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

Back to Top