ప్రారంభమైన 160 రోజు పాదయాత్ర

కైకలూరు: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌
రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.  కొద్ది సేపటి క్రితం కైకలూరు శివారు నుంచి వైఎస్‌
జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు పాదయాత్ర ద్వారా  1981 కిలోమీటర్లు నడిచిన జననేత ఈ రోజు మధ్యాహ్నం
పశ్చి మగోదావరి జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. సోమవారం నాడు పాదయాత్ర రెండు వేల
కిలోమీటర్ల మైలురాయిను దాటనున్న సందర్భంగా ఏలూరు మండలంలో పార్టీ నాయకులుపెద్ద ఎత్తున
కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా 40 అడుగుల పైలాన్ ను వైయస్ జగన్
ఆవిష్కరించనున్నారు. 

Back to Top