<br/>గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌ను శనివారం పొన్నూరు నియోజకవర్గ ప్రజలు కలిశారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని సూచించారు.