పాదయాత్రలో దివ్యాంగుల దినోత్సవం

దివ్యాంగులతో కలిసి కేక్‌కట్‌ చేసిన వైయస్‌ జగన్‌
శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దివ్యాంగులు కలిశారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారితో కలిసి వైయస్‌ జగన్‌ కేక్‌కట్‌ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
Back to Top