ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నష్టపోతున్నాం

కృష్ణా: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోతున్నామని పీఈటీ అభ్యర్థులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ వారు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరుద్యోగ పీఈటీ అభ్యర్థుల పొట్టకొట్టే విధంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డీఎస్సీ రాసే పీఈటీ అభ్యర్థులకు టెట్‌ పరీక్ష నిర్వహించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. టెట్‌ నిర్వహణతో నష్టపోతున్నామన్నారు. మాకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్‌లో పెట్టి 45 రోజుల్లో పరీక్షలకు సిద్ధం కావాలంటే ఎలా అన్నారు. బతుకుదెరువు కోసం చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను కూడా వదులుకొని డీఎస్సీ కోసం సిద్ధం అవుతుంటే ప్రభుత్వం టెట్‌ పెట్టడం మంచిపద్ధతి కాదన్నారు. తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు వివరించామని, న్యాయం జరిగే విధంగా చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 
Back to Top