ఎద్దుల‌వారిప‌ల్లెలో జ‌నంతో మ‌మేకంచిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా కంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎద్దుల‌వారిప‌ల్లె గ్రామంలో జ‌నంతో మ‌మేకం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు త‌మ స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. పొదుపు సంఘాల మ‌హిళ‌లు త‌మ డ్వాక్రా రుణాలు మాఫీ కాలేద‌ని వాపోయారు. విద్యార్థులు త‌మకు స్కాల‌ర్‌షిప్‌లు రాలేద‌ని, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ఇంకా మంజూరు కాలేద‌ని తెలిపారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో మంచి రోజులు వ‌స్తాయ‌ని, అంద‌రికి న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top