కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని వికలాంగులు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మంగళవారం డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పింఛన్లు రావడం లేదని జననేత వద్ద దివ్యాంగులు వాపోయారు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని వారు వైయస్ జగన్‌ను కోరారు.