రాజన్నబిడ్డ కోసం ఎదురుచూస్తున్న పెనుగొండ

పశ్చిమగోదావరి: పెనుగొండ నియోజకవర్గం రాజన్న బిడ్డ రాకకోసం ఎదురుచూస్తోంది. ప్రజా సంకల్పయాత్ర సాగే దారి మొత్తం వైయస్‌ జగన్‌ ఫ్లెక్సీలతో నింపారు. ఉప్పొంగిన అభిమానంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెనుగొండ వాసులంతా సన్నద్ధమయ్యారు. సాయంత్రం పెనుగొండలోకి ప్రవేశించనున్న వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే గాంధీ బొమ్మ సెంటర్‌లో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు అచెంట నియోజకవర్గం నుంచి గ్రామాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలన్నీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువస్తామన్నారు. ప్రజల సమస్యలపై జననేత బహిరంగ సభలో ప్రసంగించి ప్రభుత్వ నిరంకుశ పోకడను ఎండగడతారన్నారు.
Back to Top