వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన పామాయిల్ రైతులు


తూర్పు గోదావ‌రి జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పామాయిల్ రైతులు గురువారం క‌లిశారు. వడ్డిపర్రు క్రాస్ రైతులు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా పామాయిల్‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని ఆయ‌న‌కు ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top