700 కిలోమీటర్ల మైలు రాయి చేరువలో ప్రజాసంకల్ప యాత్ర

 

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలు రాయికి చేరువలో ఉన్నారు. మరికాసేపట్లో పీలేరు నియోజకవర్గంలోని జమ్మిలవారిపల్లె గ్రామం చేరుకోగానే 700 కిలోమీటర్లు పూర్తి అవుతుంది. ఈ మేరకు జననేతకు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల ముగ్గులు వేసి, పూలబాట వేశారు. 700 కిలోమీటర్ల వద్ద వైయస్‌ జగన్‌ మొక్కను నాటనున్నారు.
 
Back to Top