జననేతను కలిసిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

చిత్తూరు:

సమాన పనికి సమాన వేతనం అందించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

Back to Top