జననేతను కలిసిన ఓరుగంటిరెడ్లు

ప్రకాశం: ఆర్థికంగా వెనుకబడిన ఓరుగంటిరెడ్లను ఆదుకోవాలని వారంతా వైయస్‌ జగన్ను కోరారు. ప్రకాశం జిల్లా చీరాలలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఓరుగంటిరెడ్లు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన ఓరుగంటిరెడ్లను ఆదుకోవాలని, ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వైయస్‌ జగన్‌ విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్‌షిపులు ఇచ్చి ఉన్నత చదువులు చదివిస్తానని, ఓరుగంటిరెడ్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. కోస్తాలో నాలుగు జిల్లాలో 4 లక్షలకుపైగా ఉన్న ఓరుగంటిరెడ్లు అందరూ వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 
Back to Top