వైయస్‌ జగన్‌ను కలిసిన ఆన్‌లైన్‌ క్యాబ్‌ డ్రైవర్లు

విశాఖపట్నం: తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం ఆన్‌లైన్‌ క్యాబ్‌ ఓనర్ల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో కరాస జంక్షన్‌ వద్ద వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆన్‌లైన్‌ క్యాబ్‌ ఓనర్ల సంఘం నేతలు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టులలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. 
 
Back to Top