వైయస్‌ జగన్‌కు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు మద్దతు వెల్లువెత్తుతుంది. 64వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో  ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యుడు వాసుదేవరెడ్డి  వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి మేము సైతం జగనన్నతోనే అంటూ ఆయన వెంట నడుస్తున్నామన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నీటి సరఫరా చేస్తున్నామని, ట్రైసైకిళ్లు అందజేస్తున్నామని, మెడికల్‌ క్యాంపులు మా వంతుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయ్యేంత వరకు జగనన్న వెంటే ఉంటామని వారు పేర్కొన్నారు.

 
Back to Top