ఏడాదిగా వేతనాలు లేని ఆయుష్ ఉద్యోగులు

నెల్లూరు :

 ఏడాదిగా వేతనాలు ఇవ్వలేదంటూ ఆయుష్  ఉద్యోగులు  ప్రతిపక్ష నేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ ను సోమవారం ఉదయం ఆయుష్ ఉద్యోగులు కలుసుకుని తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వేతనాలు అందక పడుతున్న పాట్లను వివరిస్తూ, తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top