వైయ‌స్ జ‌గ‌న్‌కు న్యూజెర్సీ ప్ర‌వాస‌భార‌తీయుల మ‌ద్ద‌తు

చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు తెలుగు రాష్ట్రాలే కాదు..దేశ విదేశాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. రెండు రోజుల క్రితం అమెరికాలో స్థిర‌ప‌డ్డ చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు జిల్లాకు చెందిన హ‌రిబాబు దంప‌తులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. ఇవాళ న్యూజెర్సీలో స్థిర‌ప‌డ్డ ప్ర‌వాస‌భార‌తీయులు జ‌న‌నేత పాద‌యాత్ర‌లో పాల్గొని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ భ‌విష్య‌త్తు కారాచ‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌వుతామ‌ని వారు చెప్పారు. 
Back to Top