ఉద్యోగులపై ఉన్న ప్రేమ కార్మికులపై లేదు

తూర్పుగోదావరి: ఉద్యోగులపై ఉన్న ప్రేమ చంద్రబాబుకు కిందిస్థాయి కార్మికులపై లేదని కాకినాడ నగర పాలక సంస్థలో పనిచేస్తే వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది వైయస్‌ జగన్‌కు తమ గోడు విన్నవించారు. చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని, తమకు కనీస వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వాటర్‌ వర్క్స్‌ కార్మికులు కలిశారు. ఈ మేరకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పదిహేనేళ్లుగా కాకినాడ మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్నా.. తమకు కనీసం వేతనాలు అందడం లేదన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. అదే విధంగా సమాన పనికి సమాన వేతనాలు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top