ముదిరాజు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి

 ప్రతి కులానికి ప్రత్యేకంగా
కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆర్ధిక చేయూతనిస్తానని ఇచ్చిన హామీ మేరకు తమ కులానికి
కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్
సంఘం సభ్యులు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ ను గురవారం నాడు ముదిరాజు సంఘం సభ్యులు కలుసుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది ముదిరాజ్ కులస్తులున్నారనీ, వారికి ప్రత్యేకంగా ఏ
వృత్తి లేకపోడంతో గుర్తింపు పొందలేక పోతున్నారని వారు వాపోయారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమను బిసి-ఎ జాబితాలో చేరుస్తూ జీవో ఇచ్చినప్పటికీ
న్యాయవివాదాలతో అది అమలునకు నోచుకోలేదని ఈ విషయంలోనూ చొరవ చూపాలని వారు జననేతకు
విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని బంజరు భూములను పంట్ల తోటలను పెంచుకునేందుకు వీలుగా ముదిరాజ్
కులస్తులకు కేటాయించాలని వారు కోరారు.

Back to Top