కర్నూలు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని గంజిహళ్లి గ్రామస్తులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌ను కోరారు. ఎంపీటీసీ ఖాజా ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని తమ సమస్యను గ్రామస్తులు జననేతకు చెప్పుకున్నారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని వైయస్ జగన్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.