మహానేత పాలనలో మైనారిటీలకు మేలు

 
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మైనారిటీలకు మేలు జరిగిందని ఆళ్లగడ్డ నియోజకవర్గ ముస్లింలు అభిప్రాయపడ్డారు. పదో రోజు పాదయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పెద్ద చింతకుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వీరి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఏడాది పాటు ఓపిక పట్టాలని మైనారిటీలకు రాజన్న బిడ్డ మాట ఇచ్చారు.
 
Back to Top