పాదయాత్రకు ముస్లిం సోదరుల మద్దతు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పాదయాత్రకు రాతన ముస్లిం సోదరులు మద్దతు పలికారు. రాతనలో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న ముస్లింలు పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. 
Back to Top