జననేతను కలిసి మాలమహానాడు అధ్యక్షుడు

పశ్చిమగోదావరి: చంద్రబాబు సర్కార్‌ దళితులను కించపరిచేలా వ్యవహరిస్తోందని మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆయన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, అధైర్య పడాల్సిన అవసరం లేదని, మంచిరోజులు వస్తాయని వైయస్‌ జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చారు.
Back to Top