టీడీపీ కక్షసాధింపు చర్యలు

విశాఖ‌:  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడున్నారని  విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వైయ‌స్‌ జగన్‌ను కలిసి తమ బాధలు వెల్లడించారు.. అర్హుల‌కు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 30 సంవత్సరాలుగా టీడీపీలో నమ్మకంగా ఉన్నానని, ఆస్తులను సైతం అమ్ముకున్నానని, కనీసం ఇంటిస్థలం కూడా ఇవ్వలేదని రేషన్‌ కార్డు కూడా తొలగించారని ఒక నాయకుడు వాపోయాడు. వైయ‌స్‌ జగనన్న గెలిస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్య‌క్తం చేశారు.
Back to Top