జననేత రాకతో కిక్కిరిసిన కోరుకొండ


విజయనగరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్ర

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అశేష ప్రజల ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 274వ రోజు ప్రజా సంకల్పయాత్ర కోరుకొండ వద్ద విజయనగరం నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ మేరకు ప్రజలు, పార్టీ నాయకులు జననేతకు ఘనస్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ రాకతో కోరుకొండ కిక్కిరిసిపోయింది. విజయనగరం– కొతవలస రహదారిపై ఇసుక వేస్తే రాలనంత జనం వైయస్‌ జగన్‌ అడుగులో అడుగు వేస్తున్నారు. 
Back to Top