దుకాన్‌–మకాన్‌ పేరుతో దోచుకున్నారు

చిత్తూరు: దుకాన్‌– మకాన్‌ పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని మైనారిటీ నేత ఖాదర్‌బాషా మండిపడ్డారు. కల్లూరులో ఏర్పాటు చేసిన మైనారిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మైనారిటీలకు 8 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. దుకాన్‌– మకాన్‌ ఎవరికిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ నేతలే పంచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని, జిత్తుల మారి నక్క అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మైనారిటీ వక్ఫ్‌భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు షాదీ పథకం కింద ఒక్క లక్ష ఇవ్వాలని వైయస్‌ జగన్‌ను కోరారు. అది కూడా పెళ్లికి ముందే ఇస్తే పేదలు తలుచుకుంటారన్నారు. రాజమండ్రిలో మౌసుమ్‌ను దాడి చేసి హతమార్చారని, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. 
 
Back to Top