వైయస్‌ జగన్‌ను కలిసిన కీలు గుర్రం కళాకారులు

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన  కీలు గుర్రం కళాకారులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గురువారం రాప్తాడు నియోజకవర్గంలో కళాకారులు జననేతకు వినతి పత్రం అందజేశారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, పింఛన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరూరు తిరుగుతూ దుర్భర జీవితం గడుపుతున్నామని కళాకారులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు లేవు, రేషన్‌కార్డు కూడా లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పింఛన్లు ఇచ్చే వారని తెలిపారు. తమ కళలకు మహానేత ప్రాణం పోశారని కొనియాడారు. వీరి సమస్యలు సానుకూలంగా విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాది పాటు ఓపిక పట్టాలని, అందరికి పింఛన్లు, పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top