జగన్నాధపురంలో టీడీపీ నేతల ఇష్టారాజ్యం

–వైయ‌స్ జగన్‌కు ఫిర్యాదు చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
విశాఖ‌:  అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైయస్‌ జగన్‌కు వివరించారు.  జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడంలేదన్నారు. టీడీపీ నేతలు దందాలు,దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారని, పాఠశాల ప్లేగ్రౌండ్‌ స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పేదలుగా చూపించుకుని పట్టాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు గ్రావెల్‌ క్వారీలను అక్రమ తవ్వకాలు అడ్డుకున్నామని, కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సిఎం అయితే మా కష్టాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. 
Back to Top