అన్న రాకతో పండుగ వాతావరణం

చిత్తూరు:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో చర్లోపల్లి గ్రామ ప్రజలు సంతోషంతో ముగినిపోయారు. జననేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 900ల కిలోమీటర్ల మైలురాయి చర్లోపల్లి గ్రామంలో దాటడంతో వారి సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. జగనన్న రాకతో పండుగ వాతావరణం వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారని పెద్ద పెద్ద కటౌట్లు, దారంతా పూలతో అలంకరించారు. 900ల కిలోమీటర్ల మైలురాయి దాటిన అనంతరం వైయస్‌ జగన్‌ గ్రామంలో రావి మొక్కను నాటారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ప్రజలతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలన్నీ విని అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top