వైయస్ జగన్ ను కలిసిన హోంగార్డులు

ధర్మవరం : 

ప్రజా సంకల్పయాత్రలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని హోంగార్డులు కలుసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే తమ సర్వీుసులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని వారు ఫిర్యాదు చేశారు. తమ  సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రబుత్వంపై వత్తిడి తేవాలని, తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా తమ వేతనాలను కూడా పెంచేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.

Back to Top