ఉద్యోగ భద్రత కల్పిస్తాం: వైయస్‌ జగన్‌

కర్నూలు: ఉద్యోగ భద్రత కల్పించాలని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. హెల్త్‌ సెంటర్‌లను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జననేతకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు జననేత స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హెల్త్‌ సెంటర్‌లను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ హామీ పట్ల హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 
Back to Top