<br/>కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని వికలాంగులు కలిశారు. బుధవారం పాదయాత్రగా గంజిహల్లి గ్రామానికి వెళ్లిన వైయస్ జగన్‌ను వికలాంగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్ రూ.3 వేలకు పెంచాలని, ఉచిత ఆర్టీసీ బస్‌పాస్ ఇప్పించాలని వారు కోరారు.