ప్ర‌తిప‌క్ష నేత‌ను క‌లిసిన‌ గ్రూప్‌-1 అభ్యర్థులు

కర్నూలు :  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిని గ్రూప్‌-1 అభ్య‌ర్థులు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర పదో రోజు  గురువారం ఆళ్లగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రూప్‌-1 అర్హత సాధించిన అభ్యర్థులు...జననేతను కలిశారు. 2011 నుంచి తాము ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పుకు రెండోసారి పరీక్ష నిర్వహించి కూడా అర్హత సాధించిన అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. 30 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పి, ఇప్పటివరకూ న్యాయం చేయలేదన్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళతామని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Back to Top