కర్నూలు: వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేముగోడు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం కోడుమూరు నియోజకవర్గం నుంచి వైయస్ జగన్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం స్థానికులు తమ సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.