కర్నూలు: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హరతులు పట్టి ఆత్మీయంగా ఆహ్వానించారు. గ్రామాల్లో పనులు లేవని, బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ ..ఏడాది పాటు ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు.