పెన్షన్‌ రాక.. అడుక్కొని బతుకుతున్నా..

కృష్ణా: ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ వృద్ధ మహిళలు జననేతకు వారి గోడు వెల్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంటాడకు చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వృద్ధ మహిళలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యను ఆయనకు చెప్పుకున్నారు. అగ్ని ప్రమాదంలో తమ ఇళ్లు కాలిపోయాయని, ప్రమాదంలో గాయాలు కూడా అయ్యాయని, సాయం కోసం అధికారుల దగ్గరకు వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నాని వాపోయారు. మరో వృద్ధురాలు భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది.. దిక్కుమొక్కు ఎవరూ లేరని, అన్నం అడుక్కొని తింటున్నానని, పెన్షన్‌ అడిగినా ఎవరూ ఇవ్వడం లేదని జననేతకు చెప్పుకుంది. పెన్షన్‌ ఇవ్వాలని, గుడిసె పోయింది ఆదుకోవాలని అధికారుల దగ్గరకు వెళ్తే ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకున్నారూ.. వెళ్లిపోండి అని బెదిరిస్తున్నారని వాపోయింది.. ఎవరినీ అడిగి పట్టించుకోకపోతే.. పాశిపని చేసుకుంటూ బతుకుతున్నానని కన్నీరు పెట్టుకుంది. వృద్ధురాలి కన్నీటి గాధను విని చలించిపోయిన వైయస్‌ జగన్‌ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. 
Back to Top