గోకివాడ ఆయ‌కట్టుకు ఆనకట్ట నిర్మించాలి

–వైయస్‌ జగన్‌ను కోరిన గోకివాడ గ్రామస్తులు
విశాఖ‌: గోకివాడ ఆయుకట్టుకు రిజర్వాయర్‌ లేకపోవడంతో  గ్రామాలు ముంపునకు గురువుతున్నాయని విశాఖ జిలా గోకివాడ గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయ‌కట్టుకు ఆనకట్ట నిర్మించాలని వైయ‌స్ జగన్‌ను కోరినట్లు తెలిపారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఆ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.60 కోట్లు కేటాయించారని, ఆయన అకాల మరణంతో రిజర్వాయర్‌ పనులు నిలిచిపోయాయన్నారు. జగన్‌ వస్తే రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిఅవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top