600ల పడవలతో మత్స్యకారుల స్వాగతం

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు స్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు కదిలారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ తూర్పు గోదావరిలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు 600ల పడవలతో మత్స్యకారులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పడవలను వైయస్‌ఆర్‌ సీపీ జెండాలను నింపి గోదావరిలో షికార్లు కొడుతున్నారు. అదే విధంగా రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వైయస్‌ఆర్‌ సీసీ జెండాలతో నిండిపోయింది.
Back to Top