వైయస్‌ జగన్‌ను కలిసిన ఆక్వా రైతులు


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆక్వా రైతులు కలిశారు. హాచరీస్‌ నుంచి సరైన సీడ్‌ ఇవ్వడం లేదని, సీడ్‌ను పరీక్షించేందుకు సరైన ల్యాబ్‌లు లేవని జననేత దృష్టికి తీసుకెళ్లారు. బాబు సర్కార్‌ కరెంటు చార్జీలు పెంచి అధిక భారం మోపిందన్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌జగన్‌ ఆక్వా రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top