మ‌త్స్య‌కారులతో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేకం


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌త్స్య‌కారుల‌తో మ‌మేక‌మ‌య్యారు. చెరువులో చేప‌లు ప‌డుతున్న వారితో ఆయ‌న మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీ జాబితాలో చేర్చుతామ‌ని చంద్ర‌బాబు మాట త‌ప్పార‌ని వారు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఎలాంటి రాయితీలు అంద‌డం లేద‌ని, మీరు అధికారంలోకి వ‌చ్చాక మ‌త్స్య‌కారుల‌ను ఆదుకోవాల‌ని వారు జ‌న‌నేత‌ను కోరారు.
Back to Top