జననేత రాకతో పాటిబండ్లలో పండుగ

గుంటూరు: తమ అభిమాన రాకతో పెద్దకూరపాడు నియోజకవర్గం పాటిబండ్లలో పండగ వాతావరణం నెలకొంది. రాజన్న బిడ్డ తమ గ్రామానికి రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉప్పొంగిపోయారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. 
 
Back to Top